సీఎం రేవంత్ రెడ్డికి సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ
- 2016లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ నియామకాలు జరగలేదని వెల్లడి
- ఎనిమిదేళ్ల క్రితమే ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్య
- మున్సిపల్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని విజ్ఞప్తి
కొందరు బిల్డర్లు అక్రమ కట్టడాలను కట్టి విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలను కొని సామాన్యులు మోసపోతున్నారని తెలిపారు. అక్రమ కట్టడాల నిరోధానికే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉండకపోయేవన్నారు. కాబట్టి, తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని ఆ లేఖలో కోరారు.