దక్షిణాఫ్రికా Vs భారత్ రెండో టీ20లో టాస్ పడింది... ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే!

South Africa opt to bowl against team India in 2nd T20I
  
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండవ టీ20 మ్యాచ్‌కు తెరలేచింది. గెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు ఇవే..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్.

దక్షిణాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యన్‌సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.

కెప్టెన్లు ఏమన్నారంటే..
జట్టులో ఎలాంటి మార్పులు లేవని, తొలి టీ20 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించాడు. టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలని భావించామని, ఈ మ్యాచ్‌లో కూడా దూకుడుగా ఆడతామని చెప్పాడు. గత మ్యాచ్‌లో ప్రదర్శన విషయంలో సంతృప్తిగా ఉన్నామని సూర్య చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామని, సానుకూల అంశాలను కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పాడు. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్  మార్క్రమ్ మాట్లాడుతూ.. క్రుగర్ స్థానంలో హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. తొలి టీ20 ఫలితం గురించి ఆలోచించడం లేదని అన్నాడు. పిచ్‌పై తేమను బౌలర్లు ఉపయోగించుకుంటారని భావిస్తున్నామని, అందుకే బౌలింగ్ ఎంచుకున్నట్టు మార్క్రమ్ చెప్పాడు.
Advertisement
India Vs South Africa
Team India
Cricket
Sports News

More Telugu News