Chandrababu: చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ముద్దు పెట్టే ప్రయత్నం చేసిన మహిళ.. వీడియో ఇదిగో!

Woman tries to kiss Chandrababu
     
అనకాపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అనూహ్య ఘటన ఎదురైంది. పుష్పగుచ్ఛం అందించిన ఓ మహిళ అనంతరం ఆయన చెక్కిలిపై ముద్దు పెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అయితే, చంద్రబాబు సున్నితంగా ఆమెను తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చంద్రబాబు నిన్న పరవాడ పర్యటన ముగించుకుని సభా వేదిక నుంచి కాన్వాయ్ వద్దకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పరవాడకు చెందిన ఓ మహిళ చంద్రబాబుపై అభిమానంతో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి మురిసిపోయింది. ఆపై ముద్దు పెట్టే ప్రయత్నం చేయగా చంద్రబాబు తిరస్కరించడంతోపాటు పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను వారించి వెనక్కి లాగారు.
Chandrababu
Anakapalle
Parawada
Viral Video

More Telugu News