ముంబయి టెస్టులో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
- వాంఖడే స్టేడియంలో భారత్, కివీస్ మూడో టెస్టు
- తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 రన్స్‌కు ఆలౌట్
- అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైన కివీస్
- భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం
న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ వాంఖడేలో సత్తాచాటాడు. ఐదు వికెట్లు తీసి రాణించాడు. హెన్రీ, సోధి, ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.