తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఈరోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.