హైదరాబాద్‌లో క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
- రాంకోఠిలోని హోల్ సేల్ దుకాణంలో ప్రమాదం
- ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన అధికారులు
- భయంతో బయటకు పరుగు తీసిన జనం
ప్రమాదం జరిగినప్పుడు క్రాకర్స్ దుకాణంలోనూ చాలామంది ఉన్నారు. వారు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వచ్చారు. క్రాకర్స్ దుకాణం పక్కనే హోటల్ ఉంది. హోటల్ నుంచి కూడా జనం భయంతో బయటకు పరుగు తీశారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.