ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్... ఫొటోలు ఇవిగో!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్... ఫొటోలు ఇవిగో!

Parthiban met Pawan Kalyan in Mangalagiri
  • నేడు మంగళగిరి విచ్చేసిన పార్థిబన్
  • జనసేన కార్యాలయానికి రాక
  • పవన్ తో మర్యాదపూర్వక భేటీ
ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. పార్థిబన్ ఇవాళ సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి విచ్చేశారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా పవన్... పార్థిబన్ ను సత్కరించి, పలు జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా పవన్ కు జ్ఞాపిక అందించారు. అంతేకాదు, తన ముఖ చిత్రంతో కూడిన ఓ పుస్తకాన్ని కూడా బహూకరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. 
Advertisement
Parthiban
Pawan Kalyan
Mangalagiri
Janasena
Andhra Pradesh
Kollywood

More Telugu News