జనగామలో రెండు షాపింగ్ మాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
- సిద్దిపేట మార్గంలోని బట్టల దుకాణంలోప్రమాదం
- విజయ షాపింగ్ మాల్‌లో మంటలు... పక్కనే ఉన్న శ్రీలక్ష్మి మాల్‌కూ అంటుకున్నవైనం
- ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు
జనగామ సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. జనగామ ఫైరింజన్లు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి రప్పించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా రెండు బట్టల దుకాణాల్లో రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.