అప్పుల్లో కూరుకుపోయి... హైదరాబాద్‌లో ఏపీకి చెందిన టెక్కీ ఆత్మహత్య
- గచ్చిబౌలి హాస్టల్లో ఉంటున్న తణుకుకు చెందిన నాగప్రభాకర్
- కోకాపేటలో ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న టెక్కీ
- కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్న నాగప్రభాకర్
- హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య
అతను కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిన్న కోకాపేటలోని హాస్టల్ భవనం 7వ అంతస్తు పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇతను ఈ హాస్టల్ భవనానికి ఎందుకు వచ్చాడో తెలియరాలేదు. నాగప్రభాకర్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం సికింద్రాబాద్‌లో ఉంటున్న సోదరికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.