రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే...!

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే...!

Centre releases tax devolution to states
  • ఈసారి రూ.1,78,173 కోట్ల మేర పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం
  • ఏపీకి రూ.7,211 కోట్లు... తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల
  • అత్యధికంగా యూపీకి రూ.రూ.31,962 కోట్లు
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ పన్నుల వాటా రూ.89,086.50 కోట్లు కాకుండా... ఈసారి రూ.1,78,173 కోట్ల మేర పన్నుల వాటా విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం నేడు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులోనే ఒక నెల ముందస్తు చెల్లింపు (అడ్వాన్స్ పేమెంట్)ను కూడా చేర్చినట్టు వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు దక్కనుండగా... తెలంగాణకు రూ.3,745 కోట్లు లభించనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు రూ.31,962 కోట్ల మేర పన్నుల వాటా కేటాయించారు. 

బీహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్లు పన్నుల వాటా రూపేణా దక్కనున్నాయి.
Advertisement
Tax Devolution
States
Nirmala Sitharaman
NDA

More Telugu News