ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు
- అందుకనే దేశంలో గోవధ కొనసాగుతోందని ఆరోపణ
- యూపీ నుంచే అత్యధికంగా గొడ్డుమాంసం ఎగుమతి అవుతోందని ఆవేదన
- తిరుమల లడ్డూ వివాదంపై శంకరాచార్య విచారం
ఉత్తరప్రదేశ్‌లో మహంత్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గొడ్డుమాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ గొడ్డుమాంసం కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాదిమంది భక్తులకు పంచడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అది హిందువులను దెబ్బతీసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దీనిపై త్వరగా దర్యాప్తు పూర్తిచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.