పవన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
- ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన కిలారి రోశయ్య
- రేపు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
- గత ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోశయ్య
2019 ఎన్నికల్లో రోశయ్య పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రోశయ్యతో పాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.