ఏపీలో వైన్ షాపుల కొత్త టైమింగ్స్ ఇవే..
- ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు వైన్స్ ఓపెన్
- తక్కువ ధరలకు క్వాలిటీ మద్యం అందిస్తామన్న మంత్రి
- రెండేళ్ల పరిమితితో షాప్ లైసెన్సుల మంజూరు
వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబిస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తామన్నారు. షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాలని, లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం తిరిగి ఇవ్వబడదని (నాన్ రిఫండబుల్) మంత్రి చెప్పారు. గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సులలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.