హంసల దీవిలో వెనక్కి వెళ్లిన సముద్రం.. ఏ విపత్తుకు సంకేతమో!.. వీడియో ఇదిగో!
--
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం కాగా ఇటు సముద్రం మాత్రం వెనక్కి వెళ్లడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర తీరం వెంబడి ఎలాంటి గాలులు వీయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కోడూరు మండలం హంసలదీవిలోని పాలకాయథిప్ప బీచ్ వద్ద ఈ వింత చోటుచేసుకుంది.