Advertisement

అతడి వ్యాఖ్యలు పట్టించుకోనవసరం లేదు: వినేశ్ ఫోగాట్

Vinesh Phogat says Brij Bhushan is not country
  • కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
  • తీవ్ర విమర్శలు గుప్పించిన రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్
  • తన దృష్టిలో బ్రిజ్ భూషణ్ లేనే లేడన్న వినేశ్
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెపై రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యలపై తాజాగా వినేశ్ ఫోగాట్ స్పందించింది. 

బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యలను పట్టించుకోనవసరంలేదని, తన దృష్టిలో అతడు లేనే లేడని స్పష్టం చేసింది. దేశ ప్రజలంతా తనకు మద్దతుగా ఉన్నారని భావిస్తున్నానని తెలిపింది. ఇప్పటివరకు రెజ్లింగ్ లో నేను సాధించింది ఏదైనా ఉందంటే అది ప్రజల ఆశీర్వాద బలం వల్లే... రాజకీయాల్లోనూ ప్రజా దీవెనలతోనే విజయవంతం అవుతాను... ప్రజలే నా బలం అని వినేశ్ ఫోగాట్ పేర్కొంది.

కాంగ్రెస్ లో చేరిన వినేశ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ నిర్వహించిన ఓ రోడ్ షోలో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. ఇక, రెజ్లర్ల నిరసన గురించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాట్లాడతానని తెలిపారు.
Advertisement
Vinesh Phogat
Congress
Brij Bhushan
Assembly Elections
Haryana

More Telugu News