ప్రకాశం బ్యారేజీపైకి వాహనాలకు నో ఎంట్రీ
--
వాహనాలను బ్యారేజీ పైకి అనుమతించడంలేదు. వరద భారీగా వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని వదలడంతో పాటు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం ఉందని, కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను తెరిచి నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు వివరించారు.