తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత... కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం
- రాత్రి ఎనిమిది గంటల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత
- జైలు బయట స్వాగతం పలికిన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు
- కుటుంబ సభ్యుల్ని హత్తుకొని కన్నీటిపర్యంతమైన కవిత
భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికారు. భర్త అనిల్ ను, సోదరుడు కేటీఆర్ ను, కొడుకులను హత్తుకొని కవిత కన్నీటిపర్యంతమయ్యారు. కవిత రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. నేరుగా ఫామ్ హౌస్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్‌ను కలుస్తారు.