Gods at Six O'Clock: వచ్చిన పని మర్చిపోయి తీరిగ్గా పుస్తకం చదువుతూ దొరికిపోయిన దొంగ.. ఆ పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తానన్న రచయిత

Italian Thief Puts Stealing On Hold To Read A Book About Greek Mythology
షార్ట్స్‌లో చూడండి
మనం ఏ పని చేస్తున్నామో, దానిపైనే పూర్తి ఏకాగ్రత పెట్టకుంటే ఏమవుతుందో చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ. చోరీకి వచ్చిన ఓ దొంగ ఆ పని మర్చిపోయి ఇంట్లో కనిపించిన పుస్తకం చదువుతూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. చివరికి పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిందీ ఘటన.

రాజధానిలోని ప్రతి జిల్లాలో బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్‌లోకి చొరబడిన 38 ఏళ్ల దొంగ విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగా ‘హోమర్స్ ఇలియడ్’ పుస్తకం కనిపించింది. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం అతడిని ఆకర్షించింది. దానిని చదవకుండా ఉండలేకపోయాడు. తాను చోరీకి వచ్చిన విషయం మర్చిపోయి కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. 

71 ఏళ్ల ఇంటి యజమాని లేచి చూసేసరికి ఓ ఆగంతుకుడు తన ఇంట్లో పరిసరాలు మర్చిపోయి పుస్తకం చదవడంలో లీనమైన విషయాన్ని గుర్తించాడు. యజమాని వచ్చిన విషయాన్ని కూడా గుర్తించని దొంగ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయాడు. చివరికి యజమానే అతడి భుజంపై చేయి వేసి తట్టాడు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన దొంగ.. వచ్చిన దారినే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు.

ఆ దొంగను అంతగా ఆకర్షించిన పుస్తకం ఏంటో తెలుసా? ‘గాడ్స్ ఎట్ సిక్స్ ఓ క్లాక్’. దీనిని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ. చోరీకి వచ్చి పుస్తకం చదవకుండా ఉండలేకపోయిన దొంగ విషయం తెలిసిన నుచీ.. ఆ దొంగను ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పారు. అతడు దొరికిపోయే సరికి సగం పుస్తకం మాత్రమే చదివి ఉంటాడని, కాబట్టి పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Gods at Six O'Clock
Greek Mythology
Rome
Thief

More Telugu News