ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయన్న సోమిరెడ్డి
- మోదీ పిలుపు మేరకు వర్చువల్, ఫిజికల్ పద్దతిలో మహానాడు
- ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'మహానాడు' ఈనెల 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా 'హైబ్రిడ్' (వర్చువల్ & ఫిజికల్) పద్ధతిలో జరగబోతోందని టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, మొదట ఈ మహానాడును నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని, నెల్లూరులో జరిగి ఉంటే దాదాపు 7 వేల బస్సులు, వేలాది కార్లు, ట్రక్కులు వచ్చేవని అన్నారు. అయితే, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ, దేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరతను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారని అన్నారు.
అందుకే నెల్లూరు కాకుండా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో 'హైబ్రిడ్ మహానాడు' నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్ హైబ్రిడ్ విధానమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో అందరిలోనూ భారీ ఆసక్తి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఆయన నేతృత్వంలోనే అట్టహాసంగా జరగబోతోందని తెలిపారు.
"మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో జరిగే ఈ ప్రధాన వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు. కోవిడ్ సమయంలోనూ ఇదే విధంగా రెండు మహానాడులను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు కూడా అదే తరహాలో ఫీల్డ్ లెవెల్‌లో అన్ని క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మండలానికి రెండు క్లస్టర్లు, పెద్ద మండలాల్లో మూడు క్లస్టర్ల చొప్పున విభజించాం. ప్రతి క్లస్టర్‌లో పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు కలిపి దాదాపు 300 మంది ఒకేచోట కూర్చుని మంగళగిరి లైవ్ కార్యక్రమాలను వీక్షిస్తారు.
ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉన్నాయి. అక్కడ దాదాపు 4 వేల మందికి రెండు రోజుల పాటు అక్కడే భోజన వసతులు కల్పిస్తూ, సాయంత్రం వరకు మహానాడును వీక్షించేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనివల్ల ఫీల్డ్ లెవెల్ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం వెళ్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో అనేక సానుకూల మార్పులు వచ్చాయి. గత వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలకు పాల్పడ్డారు. కూటమి పాలనలో వాటన్నింటికీ అడ్డుకట్ట పడింది. ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు, చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు" అని తెలిపారు.
పెట్టుబడులు వరదలా వస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, లోకేశ్ నిరంతర ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి అండ తోడవ్వడంతో రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త బాటలు పడ్డాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్లలోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అనేక పరిశ్రమలు స్థాపించబడటంతో యువతకు మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఇదొక కొత్త ట్రెండ్ కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఏ పార్టీ అయినా రాష్ట్ర బాగు గురించే ఆలోచించాలని సూచించారు. కానీ, వైసీపీ మాత్రం విధ్వంసానికి మారుపేరుగా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు "ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు" అంటూ దొంగ మెసేజ్‌లు పంపి ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని రాష్ట్రం నాశనమవ్వాలని కోరుకునే ఏకైక పార్టీ ఒక్క వైసీపీ మాత్రమేనని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను తామెక్కడా చూడలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ మహానాడులో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి: 13 తీర్మానాలు
2. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి: 4 తీర్మానాలు
3. అండమాన్ అలయన్స్‌కు సంబంధించినవి: 1 తీర్మానం
4. రాజకీయ తీర్మానం : 1 తీర్మానం
ఈ తీర్మానాలపై తీర్మానాల కమిటీ సభ్యులు రెండు రోజుల పాటు క్షుణ్ణంగా చర్చించి ఫైనల్ చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుల ఆమోదం అనంతరం, ఈనెల 27, 28 తేదీలలో వీటిని మహానాడు వేదికగా అధికారికంగా ప్రవేశపెట్టడం జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.