గ్రామసభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గ్రామసభ గురించి ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలో 100 రోజులు ఉపాధి పనుల కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు. 2024-25లో చేపట్టే ఉపాధి పనులపై గ్రామసభ ఆమోదం ఉండాలని పేర్కొన్నారు.
గ్రామసభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములు కావాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు.