పవన్-ఆద్య సెల్ఫీపై రేణూ దేశాయ్ స్పందన

Renu Desai reacts on Pawan Kalyan selfie with Aadya
  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • కాకినాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్
  • తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ దిగిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, తన కుమార్తె ఆద్యతో దిగిన సెల్ఫీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీపై పవన్ మాజీ భార్య, ఆద్య తల్లి రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. 

"స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి నాన్నతో కలిసి వెళ్లొచ్చా? అని ఆద్య అడిగింది. ఆద్య నన్ను అలా అడగడం ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే, ఆమె తన తండ్రితో కొంత సమయం గడపాలని కోరుకుంటోంది. తద్వారా, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత బిజీగా ఉంటుందో, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి అర్థం చేసుకుని, అభినందించే అవకాశం ఆద్యకు లభిస్తుంది" అంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
Advertisement
Pawan Kalyan
Aadya
Selfie
Renu Desai
Instagram
Janasena
Andhra Pradesh

More Telugu News