నేపాల్‌లో జలవిలయం.. 6 సెకన్లలో కళ్లముందే కుప్పకూలి నదిలో కలిసిపోయిన భారీ కొండ
- ఈ ఘోర విపత్తుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి
- వరదలు, కొండచరియల వల్ల 24 మంది మృతి, పలువురు గల్లంతు
- హిమపాతంలో చిక్కుకుని మరో ఇద్దరు మృతి, 10 మంది గల్లంతు
నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ముస్తాంగ్ జిల్లాలో ఒక భారీ పర్వత భాగం కొద్ది సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలి నదిలో కలిసిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ భయానక దృశ్యాలు ఆ దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ముస్తాంగ్ జిల్లాలోని లేటే సమీపంలో ఒక భారీ పర్వత భాగం కేవలం ఆరు సెకన్ల వ్యవధిలోనే కాళీ గండకి నదిలోకి జారిపడింది. చార్‌ధామ్ యాత్రికులు చిత్రీకరించిన ఈ వీడియోలో, కొండచరియలు వేగంగా కిందికి దూసుకురావడంతో స్థానికులు భయాందోళనలతో కేకలు వేయడం వినిపిస్తోంది. ఈ ఘటన కారణంగా నదీ ప్రవాహానికి తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మరో వీడియోలో, కొండచరియలు విరిగిపడటంతో చెట్లతో పాటు ఒక ఇల్లు కూడా లోయలోకి కొట్టుకుపోయింది. 'ఘర్ గయీ సక్యో (ఇల్లు పోయింది) అంటూ గ్రామస్థులు భయాందోళనలతో హాహాకారాలు చేయడం, ఒక మహిళ రోదిస్తున్న దృశ్యాలు చూసేవారిని కలచివేస్తున్నాయి.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా పలు జిల్లాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు, మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్ వద్ద సంభవించిన హిమపాతంలో ఇద్దరు మరణించగా, మరో 10 మంది ఆచూకి లభ్యం కాలేదు. నెల రోజుల క్రితం సంభవించిన భోటేకోశీ వరదల విషాదం నుంచి కోలుకోకముందే నేపాల్‌ను మరో విపత్తు చుట్టుముట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.