బాధ్యతను గుర్తుచేసుకునే రోజు ఇది: పవన్ కల్యాణ్
- కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
- పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించిన పవన్
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోదులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.