కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్ విడుద‌ల‌... మ‌రోసారి అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న బాలీవుడ్ క్వీన్‌!
Add ap7am to your home Screen

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్ విడుద‌ల‌... మ‌రోసారి అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న బాలీవుడ్ క్వీన్‌!

Kangana Ranaut Emergency Trailer Out Now
  • 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా తెర‌కెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'
  • మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగన 
  • ఈ మూవీలో లీడ్ రోల్‌లో న‌టించ‌డంతో పాటు కంగన ద‌ర్శ‌క‌త్వం 
  • సెప్టెంబర్ 6న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ మేక‌ర్స్ 
బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుద‌లైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ప్ర‌ధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.

ఇక ఈ మూవీలో లీడ్ రోల్‌లో న‌టించ‌డ‌మే కాకుండా కంగన స్వయంగా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్‌ పాత్రలో సీనియ‌ర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే న‌టించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.

Advertisement
Emergency Trailer
Kangana Ranaut
Bollywood

More Telugu News