మూడో వన్డేలోనూ టీమిండియాపై టాస్ గెలిచిన శ్రీలంక
- టీమిండియా-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్
- నేడు కొలంబోలో మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య శ్రీలంక
ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, అర్షదీప్ స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ తో రియాన్ పరాగ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నాడు. పరాగ్ ఈ ఉదయం కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు.
అటు, శ్రీలంక జట్టులో అఖిల ధనంజయ స్థానంలో తీక్షణ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.