అమరావతి ఆర్-5 జోన్ లబ్ధిదారులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అమరావతిలో ఆర్-5 జోన్ తీసుకువచ్చిన గత ప్రభుత్వం
- ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాల కేటాయింపు
- నేడు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
- ఆర్-5 జోన్ లబ్ధిదారులకు వారి సొంత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని ఆదేశం
- లబ్ధిదారులకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని స్పష్టీకరణ
ఆర్-5 జోన్ లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారికోసం భూ సేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో ఇళ్ల తరహాలో కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకువచ్చి అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకువచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్ప, వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు నేడు స్పష్టం చేశారు.