చరిత్రలో తొలిసారిగా... 25 వేలకు ఎగువన ముగిసిన నిఫ్టీ
ఇవాళ ఉదయం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. దాంతో ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 82,129... నిఫ్టీ 25,078 వద్ద కొనసాగాయి.
ఇక, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, నెస్లే, మారుతి సుజుకి, రిలయన్స్, భారతి ఎయిర్ టెల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు ఆర్జించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్ గణనీయంగా నష్టాలు చవిచూశాయి.