పవన్ కల్యాణ్ టీమ్ అంటే అందరూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
- మంగళగిరిలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం
- హాజరైన నాదెండ్ల మనోహర్
- కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని పిలుపు
"ఇది మన ప్రభుత్వం... జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్ కు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి. పవన్ కల్యాణ్ టీమ్ అంటే అందరూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడంతో మనకు పదవులు వచ్చాయి... కానీ మన విజయం కోసం పాటుపడిన జనసైనికులు, వీరమహిళలను మనం మర్చిపోకూడదు. ప్రతి జనసైనికుడు, వీరమహిళ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే.
జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి... శ్వేతపత్రాలపై అవగాహన పెంచుకోవాలి. అన్నిటికంటే నిజాయతీగా పనిచేయడం ముఖ్యం" అని నాదెండ్ల మనోహర్ కర్తవ్య బోధ చేశారు.