రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ముడసర్లోవ వద్ద జీవీఎంసీ నిర్మాణాలు చేపడుతున్నారన్న శర్మ
- శర్మ లేఖపై జీవీఎంసీ అధికారుల వివరణ కోరిన పవన్ కల్యాణ్
- అలాంటి ప్రతిపాదనలేవీ లేవన్న అధికారులు
నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ... ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని శర్మ కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖపై పవన్ కల్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని అధికారులకు నిర్దేశించారు. అయితే, ముడసర్లోవ వద్ద నిర్మాణాలేవీ చేపట్టడంలేదని, అలంటి ప్రతిపాదనలేవీ లేవని జీవీఎంసీ అధికారులు పవన్ కు తెలియజేశారు.