వరల్డ్ కప్ అందించిన పిచ్‌పై ఉన్న ఇసుకను తిన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
- వరల్డ్ కప్ గెలిచాక భావోద్వేగంతో సెలబ్రేట్ చేసుకున్న కెప్టెన్
- కప్ గెలిచిన పిచ్‌పై మమకారంతో ఇసుకను తీసి నోట్లో వేసుకున్న హిట్‌మ్యాన్
- వీడియోను షేర్ చేసిన ఐసీసీ
కాగా ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందే విరాట్ కోహ్లీ ప్రకటనను ప్రస్తావిస్తూ తనకు కూడా ఇదే మ్యాచ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్లో ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి ఆస్వాదిస్తున్నానని, ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, తాను కోరుకున్నది ఇదేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లందరికీ సెల్యూట్ చేసి రోహిత్ శర్మ చప్పట్లు కొట్టి అభినందించాడు.