కోహ్లీ దారుణ వైఫల్యంపై ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ స్పందన
- విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడిన కెప్టెన్
- కోహ్లీ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్య
- నైపుణ్యం ఉన్న ఆటగాడని సమర్థన
ఇక అత్యంత కీలకమైన సెమీ ఫైనల్‌లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రీస్ టోప్లీ వేసిన ఓవర్‌లో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం విరాట్ ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విరాట్‌కు మద్దతుగా రోహిత్ మాట్లాడాడు. కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగించే అంశం కాదని అన్నాడు.
కోహ్లీ నాణ్యమైన ఆటగాడని, ఎలాంటి ఆటగాడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని మద్దతుగా నిలిచాడు. విరాట్ ఎలాంటి ఆటగాడో, అతడి విలువేంటో తాము అర్థం చేసుకోగలమని అన్నాడు. ఫామ్ ఎప్పుడూ సమస్య కాదని, అతడి ఉద్దేశం ముఖ్యమని అన్నాడు. దీని ద్వారా ఫైనల్ ఆడించడం ఖాయమని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు.
ఇక ఇంగ్లండ్‌పై విజయంపై స్పందిస్తూ.. ఒక జట్టుగా చాలా ప్రశాంతంగా ఈ మ్యాచ్ ఆడామని, పరిస్థితులకు తగ్గట్టు ఆడామని వివరించాడు. చక్కటి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని, ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకుంటున్నామని రోహిత్ చెప్పాడు.