అమెరికాలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్న దొంగ!
- గన్ తో బెదిరించి బ్యాగ్ ఎత్తుకెళ్లిన దుండగుడు
- తేరుకుని కాల్పులు జరిపిన ఏజెంట్
- బైడెన్ పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలో ఘటన
మార్గమధ్యంలో ఓ ఆగంతుకుడు కారు ఆపి గన్ తో ఏజెంట్ ను బెదిరించాడు. ఆపై కారులో ఉన్న బ్యాగ్ తీసుకుని ఉడాయించాడు. ఏజెంట్ తేరుకుని పారిపోతున్న దొంగపై కాల్పులు జరిపాడు. అయితే, దొంగ పట్టుబడలేదని సమాచారం. ఏజెంట్ కాల్పుల్లో దొంగ గాయపడ్డాడా? లేదా? అనేది కూడా తెలియరాలేదు. ఈ విషయంపై సీక్రెట్ సర్వీస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. పోలీసులు మాత్రం టస్టిన్ లో ఓ ఏజెంట్ దోపిడికి గురయ్యారని, గన్ తో బెదిరించిన దుండగుడి గురించి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.