Amit Shah: నేడు ఏపీకి అమిత్ షా... చంద్రబాబుతో భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం కేంద్రమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. నేటి రాత్రి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు అమిత్ షా-చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11.20 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు.

రేపు ప్రధాని రాక

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.55 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక వద్దకు విచ్చేస్తారు. నిన్న కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.
Amit Shah
Chandrababu
Telugudesam
BJP

More Telugu News