అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు.. ఆప్ ప్రకటన
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటన
- కాంగ్రెస్‌తో పొత్తు లేదని క్లారిటీ ఇచ్చిన పార్టీ సీనియర్ గోపాల్ రాయ్
- వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా నాలుగు సీట్లలో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. అయితే అనూహ్య రీతిలో మొత్తం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్, ఆప్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఢిల్లీ, పంజాబ్, గుజరాత్‌లలో కూడా కాంగ్రెస్, ఆప్ సహకరించుకున్న విషయం తెలిసిందే.