పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ
- ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ
- శుక్రవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ చీఫ్
- మోదీ ప్రమాణాస్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానం
ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.