శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ క్రికెట్ శిక్షణ చూశారా? ఇదిగో వీడియో
- మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో మహిమ పాత్ర కోసమే..
- తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో స్వయంగా శిక్షణ వీడియో పోస్ట్ చేసిన గ్లామర్ క్వీన్
- దేశవ్యాప్తంగా ఈ నెల 31న విడుదల కానున్న సినిమా
ఆ వీడియోలో జాన్వీ కపూర్ నెట్స్ లో ముమ్మర ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఈ వీడియోను చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ షికర్ పహారియా సైతం ఇన్ స్టా వేదికగా స్పందించాడు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు. జాన్వీ ఫిట్ నెస్ కోచ్ నమ్రతా పురోహిత్ స్పందిస్తూ ‘ఈ సినిమా కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావో తెలుసు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ పేర్కొంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు సరసన జాన్వీ నటించింది. ఇందులో మహిమ పాత్ర పోషించింది.
మరోవైపు ఈ చిత్ర బృందం ఇటీవలే యూట్యూబ్ లో ఓ బీటీఎస్ వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్ కు క్రికెట్ శిక్షణ సందర్భంగా ఎదురైన సవాళ్ల గురించి ఈ చిత్ర దర్శకుడు శరణ్ శర్మ వివరించాడు. అలాగే జాన్వీ క్రికెట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. బరోడా క్యాంప్ లో జాన్వీ శిక్షణ పొందినట్లు వివరించాడు. ఐపీఎల్ కు సిద్ధమయ్యే క్రికెటర్లు ఏ స్థాయిలో శిక్షణ పొందుతారో జాన్వీ కపూర్ సైతం అంతలా కఠోర సాధన చేసిందని ప్రశంసించాడు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.