ఆ ట్వీట్ ను డిలీట్ చేశా.. నాగబాబు
- మావాడు, పరాయి వాడు అంటూ చేసిన ట్వీట్ పై వివరణ
- ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసేన లీడర్
- విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నాగబాబు
నాగబాబు ట్వీట్ ఇదే..
తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైనా పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించిందేనని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అయితే, స్వయానా మేనమామ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అల్లు అర్జున్ అటువైపు తొంగిచూడలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఈ ట్వీట్ చేశాడని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.