హైదరాబాద్ ఆటోవాలా మజాకా.. నీ ఐడియా అదుర్స్ బ్రో..!
- ఆటో వెనుకభాగంలో చిన్న కూలర్ ఏర్పాటు చేసి అందర్నీ ఆకర్షించిన ఆటోవాలా
- ఎండవేడిమికి తాళలేక అల్లాడిపోతున్న ప్రయాణికుల కోసం సరికొత్త ఆలోచన
- నెట్టింట హైదరాబాదీ ఆటోవాలా వీడియో వైరల్
తన ఆటో వెనుకభాగంలో చిన్న కూలర్ ఏర్పాటు చేసి అందర్నీ ఆకర్షించాడు. ఉక్కపోత, వేడిగాలుల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఇలా ఏర్పాటు చేసినట్లు అతడు చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నీ ఐడియా అదుర్స్ బ్రదర్ అంటూ ఆటోవాలాను కొనియాడుతున్నారు.