ఓటరు-చెంపదెబ్బ వ్యవహారం: తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదు
- నిన్న పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఘటన
- ఓటరుపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని
- తిరిగి ఎమ్మెల్యేను కొట్టిన ఓటరు
- ఓటరుపై మూకుమ్మడి దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు
- బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు
అయితే, ఎమ్మెల్యే ఆ ఓటరుపై చేయి చేసుకోగా, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ కూడా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా సుధాకర్ పై దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. గాయాలపాలైన సుధాకర్ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదైంది. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు ఏడుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.