Advertisement

ఆ హక్కు నాకు ఉంది: బుర్ఖా తీసి ఐడీ కార్డ్ చెక్ చేయడంపై బీజేపీ అభ్యర్థి మాధవీలత

Madhavilatha responds on case against her
  • తాను లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్న మాధవీలత
  • రిక్వెస్ట్‌గానే తాను ఐడీని చెక్ చేసినట్లు వెల్లడించిన బీజేపీ అభ్యర్థి
  • రెండు బూత్‌లలో మోసం జరుగుతోందని గుర్తించానని వ్యాఖ్య
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.

తాను చాలా వినమ్రతగా 'అమ్మా, మీ ఫేస్... ఫొటో ఐడీని చెక్ చేసుకోండి' అని వారిని రిక్వెస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫేస్‌ను, ఫొటో ఐడీని చూశానన్నారు. రెండు బూత్‌లలో ఈవీఎంలను మార్చేశారని ఆరోపించారు. పోటీ చేసే అభ్యర్థిగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను తీసుకెళ్లి చూపించడానికి తనకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండు బూత్‌లలో మోసం చేస్తున్నారని.. దీనిపై ఎవరు మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Madhavi Latha
BJP
Hyderabad
Lok Sabha Polls

More Telugu News