తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల విడుదల
Advertisement

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల విడుదల

TS EAMCET hall tickets released
  • నిన్న ఫార్మా, అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్ల విడుదల
  • ఈరోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల విడుదల
  • ఎంసెట్ రాయబోతున్న దాదాపు 3.54 లక్షల విద్యార్థులు
తెలంగాణ ఎంసెట్ (ఈఏపీసెట్) పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నిన్న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే విడుదల చేశారు. ఈరోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను రిలీజ్ చేశారు. మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు... మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ కోసం దాదాపు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లను డౌన్ లో చేసుకునేవారు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
TS EAMCET
Hall Ticket
Telangana

More Telugu News