సౌత్ లో నాకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఇదే: ఇలియానా

Ileana speaks about her south industry exit
  • సౌత్ లో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ సినిమా చేశానన్న ఇలియానా
  • దీంతో దక్షిణాది వారు తాను బాలీవుడ్ కి మకాం మార్చానని అనుకున్నారన్న ఇల్లీ
  • ఇదే కారణంతో దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వలేదని వెల్లడి
గోవా బ్యూటీ... ఇలియానా. టాలీవుడ్ లో ఆమెది ఒక చరిత్ర. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఇల్లీ... కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే. ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీ నుంచి దాదాపు కనుమరుగు అయిందనే చెప్పుకోవాలి. కొత్తకొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఆమె హవా తగ్గిపోయింది. తాజాగా ఆమె దక్షిణాదిలో ఎందుకు అవకాశాలు తగ్గాయో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 

2012లో తాను అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లో 'బర్ఫీ' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని ఇలియానా తెలిపింది. ఆ టైమ్ లో తాను సౌత్ లో చాలా బిజీగా ఉన్నానని... అయితే, 'బర్ఫీ' వంటి చిత్రాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని తాను భావించాని... అందుకే తాను ఆ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించింది. కానీ, దక్షిణాది వాళ్లంతా తాను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి మకాం మార్చానని భావించారని అనుకున్నారని... ఆ ఆలోచనతోనే దక్షిణాది దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడారని తెలిపింది. 

బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తాను సినిమాలను ఎంచుకునే విధానంలో కూడా మార్పు వచ్చిందని ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని తనకు అనిపిస్తుంటుందని చెప్పింది. ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇలియానా ఒక బిడ్డకు తల్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణాదిలో దాదాపు ఆమె కెరీర్ ముగిసినట్టేనని చెప్పుకోవచ్చు.
Go Back to Shorts
Ileana
Tollywood
Bollywood

More Telugu News