చంద్రబాబు ట్వీట్ పై ఘాటుగా స్పందించిన సజ్జల
- ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సభ
- జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన చంద్రబాబు
- తోడబుట్టిన చెల్లి పుట్టుకపై వ్యాఖ్యలు చేయడం నీచం అని విమర్శలు
- చంద్రబాబుది వికృత మనస్తత్వం అంటూ సజ్జల ఫైర్
చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే... చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృత ఆలోచనలు చూస్తే మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోంది అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే... చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.