సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం చెలరేగింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సాయంత్రం మల్కాజ్‌గిరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో శామీర్‌పేటలో హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి డ్రోన్‌ను ఎగురవేశాడు. హెలిప్యాడ్ వద్ద డ్రోన్‌ను ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News