జాన్వీని చూడగానే శ్రీదేవి గుర్తుకొచ్చింది.. చాలా భావోద్వేగానికి గురయ్యాను: చిరంజీవి
- 'జగదేకవీరుడు అతిలోక సుందరి' పార్ట్-2పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
- ఈ చిత్రాన్ని చరణ్, జాన్వీ చేస్తే చూడాలనుందని వ్యాఖ్య
- తనకు కమర్షియల్ సినిమాలే సెట్ అవుతాయన్న మెగాస్టార్
తనను కమర్షియల్ సినిమాల్లో చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడతారని చిరంజీవి తెలిపారు. 'దంగల్' వంటి సినిమా చేయాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకసారి సలహా ఇచ్చారని... అలాంటి సినిమాలు తాను చేస్తే నిర్మాతలు నష్టపోతారని చెప్పారు. 'ఖైదీ' సినిమా తనకు ఎంతో క్రేజ్ తీసుకొచ్చిందని... 'రుద్రవీణ' సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని... అయితే ఆ సినిమాకు నిర్మాతగా ఉన్న తన తమ్ముడు నాగబాబు మాత్రం నష్టపోయారని తెలిపారు.