నా పెళ్లి గురించి బయటకు చెప్పకపోవడానికి కారణం ఇదే..: తాప్సీ
- ప్రియుడు మథియాస్ ను పెళ్లాడిన తాప్సీ
- పెళ్లి తమ వ్యక్తిగత విషయమన్న తాప్సీ
- ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టీకరణ
పెళ్లి చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కూడా తమకు లేదని తాప్సీ చెప్పారు. తమ తల్లిదండ్రులకు అన్నీ తెలుసని... వాళ్ల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. జీవింతంలో ఒక్కసారే చేసుకునే పెళ్లిని ఆనందంగా చేసుకోవాలని అనుకున్నానని.... అందుకే ఆర్భాటాలకు తావు లేకుండా, కొందరి సమక్షంలోనే ఒక్కటయ్యామని చెప్పారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. భవిష్యత్తులో షేర్ చేయాలనుకుంటే చేస్తానని చెప్పారు.