Shubman Gill: శుభ్ మాన్ గిల్ దూకుడు... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

Gujarat Titans posts 199 runs with the help of Shubman Gill flamboyant innings
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ కింగ్స్ తో పోరులో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. 

కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 48 బంతుల్లోనే 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచి చివరి వరకు క్రీజులో నిలిచిన గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. కేన్ విలియమ్సన్ 26, సాయిసుదర్శన్ 33 పరుగులు చేశారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబాడా 2, హర్ ప్రీత్ బ్రార్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Shubman Gill
Gujarat Titans
Punjab Kings
Ahmedabad
IPL

More Telugu News