Telangana: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు రెండు నెలల పాటు సెలవులు

  • మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటన
  • మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడి
  • ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక

తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియేట్ బోర్డు సెలవులను ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియేట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

More Telugu News