గర్భవతి అనే వార్తలపై పరిణీతి చోప్రా స్పందన

Parineeti Chopra response on pregnant rumours
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా పరిణీతి సినిమాల్లో నటిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పరిణీతి గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆమె టీమ్ ఖండించినా పుకార్లకు తెరపడలేదు. దీంతో, పరిణీతి స్వయంగా క్లారిటీ ఇచ్చింది. 

తాను గర్భవతి కాదని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తనపై పుకార్లు పుట్టిస్తున్న వారిపై సెటైర్లు వేసింది. కాఫ్టన్ డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అంటారని, కాస్త సైజు ఎక్కువున్న డ్రెస్ వేసుకున్నా గర్భవతి అంటారని, ఇండియన్ కుర్తా ధరించినా ప్రెగ్నెంట్ అంటారని ఎద్దేవా చేసింది. స్వయంగా పరిణీతి క్లారిటీ ఇవ్వడంతో వదంతులకు చెక్ పడినట్టయింది. గ్లామర్ బ్యూటీగా పేరుగాంచిన పరిణీతి ఇటీవల ఒక బిగ్ ఆఫర్ ను మిస్ చేసుకుంది. 'యానిమల్' చిత్రంలో ఆమె నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలోకి రష్మిక మందన్న వచ్చింది.
Go Back to Shorts
parineeti Chopra
Bollywood
Pregnant

More Telugu News