తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం
- గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
- రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
రేపు ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.